Crime news: 40 సెకన్లలోనే మేడ్చల్‌ ఆభరణాల దుకాణంలో దోపిడీ: సీపీ అవినాష్ మహంతి

మేడ్చల్‌లోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో పట్టపగలే దోపిడీ జరగడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Updated : 22 Jun 2024 16:51 IST

హైదరాబాద్‌: బురఖా వేసుకుని ఒకడు.. హెల్మెట్‌తో మరొకడు వచ్చి ఓ బంగారు ఆభరణాల దుకాణ యజమానిని కత్తితో పొడిచి పట్టపగలే దోపిడీకి యత్నించిన ఘటన మేడ్చల్‌లో కలకలం సృష్టించింది. ఈ కేసులో నిందితులను 24గంటల్లోనే అరెస్టు చేసినట్టు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ‘‘ఈ నెల 20న మేడ్చల్‌ లోని శ్రీ జగదాంబ జువెలర్స్‌ దుకాణంలోకి బురఖా వేసుకుని ఒకరు, హెల్మెట్‌ ధరించి మరో దుండగుడు వచ్చారు. నగలు, నగదు చోరీ చేశారు. 40 సెకన్లలోనే దోపిడీ పూర్తి చేశారు. నిందితులు పారిపోయిన నేపథ్యంలో 200 సీసీ కెమెరాలు పరిశీలించాం. కిలో మీటరు దూరంలో బైక్ వదిలిపెట్టి వారు పరారయ్యారు. ఓయూ, హబ్సిగూడలో బైక్‌లు దొంగలించారు. నిందితులను పట్టుకునేందుకు 16 బృందాలను ఏర్పాటు చేసి గాలించాం. ఇటీవల చాదర్‌ఘాట్‌లో జరిగిన చోరీ కేసులో కూడా వీళ్ల ప్రమేయం ఉన్నట్లు గుర్తించాము. నజీం, సోహైల్‌ను అరెస్ట్ చేశాం. చోరీ నిమిత్తం వీరు మూడు సార్లు రెక్కీ నిర్వహించారు. బంగారం షాప్‌ను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడ్డారు’’ అని సీపీ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని