Crime News: ఖమ్మంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మంలో జరిగింది. 

Updated : 04 Jun 2023 21:16 IST

ఖమ్మం: వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మంలో జరిగింది. నగరంలోని మెడికల్‌ కాలేజీలో చదువుతున్న వైద్య విద్యార్థిని మానస(22) .. అదే కళాశాల ఎదురుగా ఉన్న హాస్టల్‌ గదిలో పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో మానస నాలుగో సంవత్సరం చదువుతోందని, ఆమె స్వస్థలం మహబూబాబాద్‌ అని పోలీసులు వెల్లడించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు