Kashmir: ఉదయం బ్యాంకు మేనేజర్‌ హత్య.. గంటల వ్యవధిలోనే ఉగ్రవాదులు మరో ఘాతుకం

జమ్ముకశ్మీర్‌లో సాధారణ పౌరులపై ఉగ్రవాదుల కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయం కుల్గామ్‌ జిల్లాలో మేనేజర్‌ విజయ్‌ కుమార్‌ను ముష్కరులు కాల్చి చంపిన ఘటన మరవక ముందే.. కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఘాతుకానికి తెగబడ్డారు.

Published : 03 Jun 2022 01:34 IST

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో సాధారణ పౌరులపై ఉగ్రవాదుల కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయం కుల్గామ్‌ జిల్లాలో మేనేజర్‌ విజయ్‌ కుమార్‌ను ముష్కరులు కాల్చి చంపిన ఘటన మరవక ముందే.. కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఘాతుకానికి తెగబడ్డారు. ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతిచెందగా, మరొక కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన కార్మికుడిని బిహార్‌కు చెందిన దిల్‌కుష్‌ కుమార్‌గా గుర్తించారు.  

ఈ రోజు ఉదయం కుల్గామ్‌ జిల్లాలో బ్యాంకులోకి చొరబడిన ఉగ్రవాదులు మేనేజర్‌ విజయ్‌ కుమార్‌ను కాల్చిచంపారు. విజయ్‌ స్వస్థలం రాజస్థాన్‌లోని హనుమాన్‌నగర్‌గా కశ్మీర్‌ పోలీసులు గుర్తించారు. మే 1 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. దీంతో కశ్మీర్‌లోని పరిస్థితులపై విపక్షాలు, భాజపాపై ఎదురుదాడికి దిగాయి. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వరుస సంఘటనల నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని