Nandikotkur: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య?

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎల్లాల గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక హత్యకు గురైనట్లు సమాచారం.

Published : 10 Jul 2024 03:14 IST

నిందితులు ముగ్గురు బాలురని అనుమానం 

నందికొట్కూరు, పగిడ్యాల, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎల్లాల గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక హత్యకు గురైనట్లు సమాచారం. 14 నుంచి 16 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు బాలురు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఇంట్లో చెబుతుందన్న భయంతో కాలువలోకి తోసేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న బాలురలో ఒకరు ఈ  మేరకు నేరం ఒప్పుకొన్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం నుంచి తమ బిడ్డ కనిపించడం లేదని బాలిక తండ్రి అదేరోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆమె ఆచూకీ త్వరగా గుర్తించాలని సోమవారం పోలీసులను ఆదేశించారు. పోలీసులు మంగళవారం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. పోలీసు జాగిలం స్థానిక ముచ్చుమర్రి పార్కు నుంచి ఎత్తిపోతల పథకం పరిసరాల్లో తిరిగి పంపుహౌస్‌ వద్దకు వచ్చి ఆగిపోయింది. ఆదివారం సాయంత్రం ఒంటరిగా పార్కు వద్ద ఉన్న బాలికకు ముగ్గురు బాలురు ఆ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి, తర్వాత కాలువలోకి తోసేసి హత్య చేసినట్లు తెలుస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు