Hyderabad News: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌.. ఆ వీడియోలు డిలీట్‌ చేయించండి!

జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచారంటూ మైనర్‌ బాలిక తల్లిదండ్రులు మహిళా భద్రతా విభాగంలో ఫిర్యాదు చేశారు.

Updated : 03 Aug 2022 12:03 IST

మహిళా భద్రతా విభాగానికి మైనర్‌ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచారంటూ మైనర్‌ బాలిక తల్లిదండ్రులు మహిళా భద్రతా విభాగంలో ఫిర్యాదు చేశారు. బాలికతో ఐదుగురు కలిసి అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు, ఆమె మెడపై గాయమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచారని.. వాటిని తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మహిళా భద్రతా విభాగం ఈ కేసును హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు బదిలీ చేసింది. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక దృశ్యాలను తొలగించాలని ఇన్‌స్టా ఖాతాదారులకు నోటీసులు ఇచ్చారు. 

ఈ ఏడాది మే 28న హైదరాబాద్‌లో జరిగిన అత్యాచార ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలికపై సాదుద్దీన్‌ సహా మరో నలుగురు మైనర్‌ బాలురు సామూహిక అత్యాచారం చేశారు. జూన్‌ 2న మైనర్‌ బాలిక, నిందితుల వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిన పాతబస్తీకి చెందిన వ్యక్తికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులిచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అప్‌లోడ్‌ కావడంతో పోలీసులు ఐపీ వివరాలు సేకరిస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు