Nandhyala: నంద్యాల జిల్లాలో బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం.. ఆపై హత్య!

నంద్యాల జిల్లాలో బాలిక (8) అదృశ్యం ఘటన కలకలం రేపింది.

Updated : 10 Jul 2024 12:34 IST

నందికొట్కూరు: నంద్యాల జిల్లాలో బాలిక (8) అదృశ్యం ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎల్లాల గ్రామానికి చెందిన బాలిక మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. ఆమె తండ్రి నందికొట్కూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. 

ఈ క్రమంలో ముగ్గురు మైనర్‌ బాలురను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆదివారం సాయంత్రం ముచ్చుమర్రి పార్కు వద్ద బాలిక ఆడుకుంటుండగా సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లామని.. అనంతరం అత్యాచారం చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ విషయం బయటపడుతుందనే భయంతో బాలికను కాల్వలోకి తోసేశామని తెలిపారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు