
Rajasthan: భాజపా ఎంపీ నివాసంపై కాల్పులు
జైపుర్: రాజస్థాన్‌లో భాజపా ఎంపీ రంజీతా కోలీ నివాసంపై మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. భరత్‌పుర్ జిల్లా బయనాలోని ఆమె ఇంటికి బెదిరింపులతో కూడిన లేఖను సైతం అతికించారు. స్థాయికి మించిన పనుల్లో తలదూర్చితే కాల్చి చంపేస్తామని లేఖలో పేర్కొన్నారు. తమ నుంచి ఎవరూ కాపాడలేరంటూ ఆమెను బెదిరించారు. ఈ ఘటనతో ఎంపీ స్పృహ తప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఏడాది మే 27న కోలీ కారుపై దుండగులు దాడి చేశారు. ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరించారు. ఇప్పుడు ఏకంగా కాల్పులకు తెగబడ్డారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.