Crime news: ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి బలవన్మరణం

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులకు ఉరివేసి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

Published : 06 Feb 2023 18:55 IST

నరసరావుపేట: ఇద్దరు కుమారులతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పెద్ద చెరువులో చోటు చేసుకుంది. శివలింగేశ్వరి (27) అనే మహిళ తన ఇద్దరు కుమారులు చరణ్‌సాయిరెడ్డి (8), జతిన్‌రెడ్డి (4)ను చంపేసి.. తానూ ఉరివేసుకుంది. రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడుకు చెందిన దొండేటి శివలింగేశ్వరికి నరసరావుపేటకు చెందిన ఇంద్రసేనారెడ్డితో వివాహం జరిగింది. ఇటీవల వారి కుటుంబంలో తరచూ కలహాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లలిద్దరికీ ఉరివేసి, అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రెండో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని