Crime: ఐదుగురు కన్నబిడ్డల్ని చంపిన తల్లికి జీవితఖైదు!

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డల్ని కర్కషంగా హతమార్చిన తల్లికి జర్మనీ కోర్టు జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్లపాటు పెరోల్‌ కూడా ఇవ్వకూడదని తీర్పు వెల్లడించింది. సోలింగెన్‌ ప్రాంతానికి చెందిన 28ఏళ్ల క్రిస్టియానె.కె గతేడాది సెప్టెంబర్‌లో తన ఆరుగురు బిడ్డల్లో ఐదుగురిని దారుణంగా హత్య చేసింది. వారిలో

Published : 05 Nov 2021 01:38 IST

బెర్లిన్‌: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డల్ని కర్కశంగా హతమార్చిన తల్లికి జర్మనీ కోర్టు జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్లపాటు పెరోల్‌కి అనర్హురాలిగా తీర్పు వెల్లడించింది. సోలింగెన్‌ ప్రాంతానికి చెందిన 28ఏళ్ల క్రిస్టియానె.కె గతేడాది సెప్టెంబర్‌లో తన ఆరుగురు బిడ్డల్లో ఐదుగురిని దారుణంగా హత్య చేసింది. వారిలో ఒక సంవత్సరం, రెండు, మూడు ఏళ్ల వయసున్న ముగ్గురు కుమార్తెలుండగా.. ఆరు, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిని హత్య చేసి మృతదేహాలను వస్త్రంలో చుట్టి బెడ్‌పై పెట్టింది. మరో కుమారుడు హత్య జరిగే సమయంలో పాఠశాలలో ఉండటంతో ప్రాణాలు దక్కాయి. కాగా.. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించిన క్రిస్టియానె రైలు కిందపడబోయింది. అయితే, స్థానికులు ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించడంతో ఈ ఘోరం బయటపడింది.

పిల్లల్ని చంపే ముందు వారికి మత్తుమందు కలిపిన అల్పాహారం ఇచ్చిందని, ఆ తర్వాత హత్య చేసిందని కోర్టులో న్యాయవాదులు వాదన వినిపించారు. ఆమెకు దూరమైన భర్త.. మరో మహిళతో కలిసి ఉన్న ఫొటో చూసి ఆవేశానికి గురైందని.. ఆ కోపంలోనే పిల్లల్ని హత్య చేసిందని తెలిపారు. మరోవైపు తాను నిర్దోషినని.. ఇంట్లోకి ఓ దుండగుడు ముసుగు వేసుకొని వచ్చి ఈ హత్యలు చేశాడని క్రిస్టియానె తెలిపింది. కానీ, విచారణలో ఆమె చెప్పినవి అబద్ధమని తేలడంతో కోర్టు ఆమెకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని