దెయ్యం పట్టిందని కొడుకును కొట్టి చంపిన తల్లి

శాస్త్ర, సాంకేతిక రంగంలో ప్రపంచం దూసుకెళ్తున్న సమయమిది. నూతన సాంకేతిక పరిజ్ఞానం కలలో

Published : 22 Jun 2021 06:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శాస్త్ర, సాంకేతిక రంగంలో ప్రపంచం దూసుకెళ్తున్న సమయమిది. నూతన సాంకేతిక పరిజ్ఞానం కలలో కూడా ఊహించని అద్భుతాలను కళ్లముందు ఆవిష్కరిస్తున్న తరుణమిది. ఇలాంటి కాలంలో కూడా కొన్ని చోట్ల మూఢ నమ్మకాల జాఢ్యం పట్టిపీడిస్తూనే ఉంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే తమిళనాడులో జరిగిన ఈ ఘటన.

తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా, కన్నమంగళం గ్రామానికి చెందిన తిలకవతి అనే మహిళ.. దెయ్యం పట్టుకుందని తన ఏడేళ్ల కొడుకును కొట్టి చంపింది. తన కుమారుడికి దెయ్యం పట్టిందని భావించిన తిలకవతి కన్నమంగళంలోని ఓ మాంత్రికుణ్ని సంప్రదించింది. ఆ రాత్రి మాంత్రికుడు ఉండే ప్రదేశంలోనే తన కుమారుడితో పాటు బస చేసింది. అయితే ఉన్నట్టుండి బాలుడికి మూర్చ రాగా.. తిలకవతి వైద్యం అందించే బదులు తన తోబుట్టువులతో కలిసి బాలుణ్ని తీవ్రంగా కొట్టింది. దాంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు తిలకవతి సహా మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని