DJ music: స్నేహితుడి పెళ్లికెళ్లి అనంతలోకాలకు.. డీజే సౌండ్‌కు యువకుడి మృతి!

పెళ్లి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన డీజే ఒకరి ప్రాణం తీసింది. ఆ శబ్దానికి ఒక బాలుడి గుండె ఆగిపోయింది. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

Published : 07 May 2022 21:39 IST

ఉజ్జయిన్‌: పెళ్లి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన డీజే ఒకరి ప్రాణం తీసింది. ఆ శబ్దానికి ఒక యువకుడి గుండె ఆగిపోయింది.  లాల్‌ సింగ్‌ (18) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో నివాసముంటున్నారు. తాజ్‌పుర్‌లో జరిగే తన స్నేహితుడి వివాహ వేడుకకు హాజరయ్యాడు. ఆ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన డీజేలో డాన్స్‌ వేశాడు. తాను స్పీకర్స్‌ దగ్గరకు వెళ్లి డాన్స్‌ వేస్తానని, దానిని వీడియో తీయాల్సిందిగా స్నేహితులతో చెప్పి స్పీకర్స్‌ దగ్గకు వెళ్లాడు. ఒక్కసారిగా సృహతప్పిపోయి కింద పడిపోయాడు. అక్కడున్న వాళ్లు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అతను మరణించినట్లు పేర్కొన్నారు.

బాలుడి మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్‌ మాట్లాడుతూ.. అతని గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో రక్తం గడ్డకట్టింది. అందుకే అతనికి గుండెపోటు వచ్చింది. అధిక శబ్దం కారణంగానే ఇలా జరిగింది. ఒక నిర్దుష్ట డెసిబెల్స్‌ స్థాయికి మించిన శబ్దాలు విన్నప్పుడు అవి మానవుల గుండె, మెదడు వంటి అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని