Madhya Pradesh: మహిళను ముక్కలుగా చేసి.. రెండు రైళ్లలో వదిలేసి..!

మహిళపై అత్యాచారానికి విఫలయత్నం చేసిన ఓ వ్యక్తి.. ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా కోసి, రెండు రైళ్లలో వదిలేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.

Published : 23 Jun 2024 20:04 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో దారుణం వెలుగుచూసింది. మహిళపై అత్యాచారానికి విఫలయత్నం చేసిన ఓ వ్యక్తి.. ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా కోసి, రెండు రైళ్లలో వదిలేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. భర్తతో గొడవపడి ఇంటినుంచి బయటకు వచ్చిన ఓ మహిళ (37).. మథుర వెళ్లేందుకుగాను ఉజ్జయిని రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఒంటరిగా ఉన్నట్లు గమనించిన కమలేశ్‌ పటేల్‌ (60) అనే వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు.

అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడి మృతి

ఆహారంలో నిద్రమాత్రలు కలిపి, అత్యాచారానికి యత్నించాడు. ఆమె మేల్కొని కేకలు వేయడంతో.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. రెండు వేర్వేరు రైళ్లలో (ఇందౌర్‌- నాగ్దా, ఇందౌర్‌- దెహ్రాదూన్‌) వదిలేశాడు. ఒక రైలు ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌, మరో రైలు మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఉండగా ఆమె శరీర భాగాలు వెలుగుచూశాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. ఉజ్జయినిలో నిందితుడిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు