Vande Bharat Rail: మరో ప్రమాదం.. వందే భారత్‌ రైలు ఢీ కొని మహిళ మృతి

వందేభారత్‌ రైళ్లకు వరుస ప్రమాదాలు ఎదురవుతున్నాయి. గాంధీనగర్‌-ముంబయి మధ్య నడుస్తున్న రైలు ఢీ కొని మంగళవారం ఓ మహిళ మృతి చెందారు.

Published : 08 Nov 2022 23:36 IST

ఆనంద్: గాంధీనగర్‌-ముంబయి మధ్య నడుస్తున్న వందేభారత్‌ (Vande Bharat)రైళ్లకు వరుస ప్రమాదాలు ఎదురవుతున్నాయి. తాజాగా గుజరాత్‌లోని ఆనంద్‌ సమీపంలో ఆర్చిబల్ద్‌ పీటర్‌ (54) అనే మహిళ ట్రాక్ దాటుతుండగా ముంబయి వైపు వెళ్తున్న వందేభారత్‌ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. సెప్టెంబరు 30న ప్రధాని మోదీ  గాంధీనగర్‌-ముంబయి మధ్య హైస్పీడ్‌ వందేభారత్‌ రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేవలం నెలరోజుల్లోనే  పశువులను ఢీ కొన్న ప్రమాదాలు మూడు చోటు చేసుకున్నాయి. అక్టోబరు 6న వాత్వా-మణినగర్‌ రైల్వేస్టేషన్ల మధ్య నాలుగు దున్నలను వందేభారత్‌ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో రైలు ముందుభాగం దెబ్బతింది. ఆ తర్వాతి రోజే ఆనంద్‌ సమీపంలో ఓ ఆవును ఢీ కొట్టింది. మరో ఘటన అతుల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని