Mumbai Murder: దుర్వాసన వస్తుంటే.. స్ప్రేకొట్టి తలుపుతీశాడు: ముంబయి హత్యను గుర్తించారిలా..!

Mumbai Murder:సహజీవన భాగస్వామిని హత్య చేసి, ముక్కలుగా చేసిన ఘటనలో మృతురాలికి చెందిన శరీర భాగాలు కొన్ని మిస్‌ అయినట్లు, వాటిని నిందితుడు వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Updated : 08 Jun 2023 17:42 IST

ముంబయి: వాణిజ్య రాజధాని ముంబయిలో జరిగిన శ్రద్ధా వాకర్(Shraddha Walkar) తరహా ఘటన స్థానికుల వల్ల వెలుగులోకి వచ్చింది. దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు  విషయం బయటపడింది. దీనిపై స్థానిక వ్యక్తులు కొందరు మీడియాతో మాట్లాడారు.( Mumbai Murder)

56 ఏళ్ల మనోజ్‌ సహానీ, 32 ఏళ్ల సరస్వతి వైద్య సహజీవన భాగస్వాములు. మూడు సంవత్సరాలుగా ముంబయి మీరారోడ్డులోని ఆకాశ్‌గంగా అపార్ట్‌మెంట్‌లో ఏడో అంతస్తులో అద్దెకుంటున్నారు. అయితే బుధవారం వారి ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. ‘వాసన రావడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు వారింటికి వెళ్లాను. కానీ ఎవరూ తలుపు తీయలేదు. ఆ తర్వాత స్ప్రే కొట్టిన శబ్దం వినిపించింది. అనంతరం మనోజ్ వచ్చి తలుపు తీశాడు. వెంటనే దీనిపై అపార్ట్‌మెంట్ నిర్వాహకులకు సమాచారమిచ్చాను. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఫ్లాట్‌లోకి వెళ్లగా.. రెండు కట్టర్‌లను గుర్తించారు. అందులో ఒక ఎలక్ట్రిక్ కట్టర్‌ కూడా ఉంది. అలాగే కిచెన్‌లో శరీర భాగాలు వేసిన మూడు బకెట్ల కనిపించాయి’అని సహానీ ఫ్లాట్‌కు పొరుగున నివసించే వ్యక్తి ఒకరు వెల్లడించారు.

ఆ కట్టర్లను, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమె శరీర భాగాలు కొన్నింటిని అతడు నగరంలోని పలు ప్రాంతాల్లో వేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ గదిలో నుంచి భరించలేని స్థాయిలో దుర్వాసన వస్తుండటంలో అక్కడ శోధించడం కష్టంగా మారిందని చెప్పారు. మనోజ్‌, సరస్వతి.. పొరుగువారితో ఎక్కువగా మాట్లాడరని తెలుస్తోంది. అలాగే ఆమె అనాథ అని గుర్తించారు. ఓ రేషన్‌ షాపులో పరిచయమైన వీరిద్దరూ.. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని