Crime news: సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు.. నటి అరెస్ట్‌

ముంబయిలో భారీ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు అయ్యింది. దీనితో సంబంధం ఉన్న ఓ యువనటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated : 22 Apr 2023 17:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయిలో భారీ సెక్స్‌ రాకెట్‌ గుట్టు బట్టబయలైంది. వర్ధమాన మోడల్స్‌తో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు బయటపెట్టారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ భోజ్‌పురి యువనటిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పు ముంబయిలోని ఆరే కాలనీలో ఉన్న ఓ ప్రముఖ హోటల్‌లో వ్యభిచారం జరుగుతోందంటూ ఇటీవల పోలీసులకు సమాచారం అందింది. దీనిపై నిఘా పెట్టిన అధికారులు.. తనిఖీలు నిర్వహించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నటిని పక్కా ప్లాన్‌ ప్రకారం అరెస్ట్‌ చేశారు. వర్ధమాన మోడల్స్‌ను ట్రాప్‌ చేసి వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఈ ముఠాతో ఇంకెవరికైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని