అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు: పోలీసు అరెస్టు

 ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత  ముకేష్‌ ‌అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు దొరికిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)అధికారులు ముంబయి పోలీసు అధికారి సచిన్‌ వాజేను  అరెస్టు చేశారు. గత నెల 25న అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన

Updated : 14 Mar 2021 14:50 IST

ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత  ముకేష్‌ ‌అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు దొరికిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)అధికారులు ముంబయి పోలీసు అధికారి సచిన్‌ వాజేను  అరెస్టు చేశారు. గత నెల 25న అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనం నిలిచి ఉండడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ఎన్‌ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ముంబయి అసిస్టెంట్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌  సచిన్‌ వాజే ప్రమేయం ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అంతకు ముందు అయనను అదుపులోకి తీసుకున్న అధికారులు 12 గంటల పాటు విచారించారు. అనంతరం అతడిపై పలు ఐపీసీ సెక్షన్లు నమోదు చేసి అరెస్టు చేశారు.  

ఫిబ్రవరి 25న ముంబయిలోని ముకేష్‌ అంబానీ ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన స్కార్పియో వాహనంలో జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ముంబయి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో స్కార్పియో వాహనం యజమాని మన్‌సుఖ్‌ హిరేన్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అయితే అంతకు ముందే ఆవాహనం చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు తీవ్రత దృష్ట్యా కేంద్ర హోం శాఖ ఆదేశాల నేపథ్యంలో ముంబయి పోలీసులు ఎన్‌ఐఏకు అప్పగించారు. అప్పటినుంచి ఎన్‌ఐఏ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వాహన యజమాని మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతిపై దర్యాప్తు జరుపుతున్న ముంబయి పోలీసు అధికారి సచిన్‌ వాజేపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయనపై వేటు వేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని