కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం 

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ పురపాలక కార్యాలయం వద్ద బహిరంగ కాల్పులకు.....

Published : 29 Mar 2021 15:12 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ పురపాలక కార్యాలయం వద్ద బహిరంగ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (బీడీసీ) సభ్యుడు రియాజ్‌ అహ్మద్‌, ఆయన గన్‌మెన్‌ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. మరో కౌన్సిలర్‌ కూడా గాయపడటంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకొని ముష్కరుల కోసం గాలింపు చేపట్టాయి.  మరోవైపు, గత ఐదు రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటన అని పోలీసులు తెలిపారు. గురువారం రోజు కూడా శ్రీనగర్‌ శివారులోని లావాయ్‌పొరాలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని