
Crime news : ఒంగోలులో పట్టపగలే దారుణం!
ఒంగోలు: నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న జంట హత్యల కేసు కీలక మలుపు తిరిగింది. మీరాబీ, ఆమె కుమారుడు అలీఫ్ను చంపిన రబ్బానీ అనే వ్యక్తే ఒంగోలులో కాశీరావు అనే యువకుడిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అంబటివారిపాలెంలో మీరాబీ, ఆమె కుమారుడు అలీఫ్ను రబ్బానీ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఒంగోలుకు చేరుకొని రవిప్రియ మాల్ సమీపంలో ఉన్న కాశీరావుపై కత్తితో దాడి చేశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని స్థానిక రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నెల్లూరులో జంట హత్యలు, ఒంగోలులో కాశీరావుపై దాడికి కారణం అక్రమ సంబంధమే కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాశీరావు అనే యువకుడు గత కొన్ని రోజులుగా రబ్బానీ టీ షాప్లో పని చేస్తున్నాడు. బాధితుడికి మెడపై, పొట్టలో తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.