Guntur: యువకుడి ఘాతుకం.. గుంటూరు జిల్లాలో వైద్య విద్యార్థిని దారుణ హత్య
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో దారుణం చోటుచేసుకుంది. బీడీఎస్ విద్యార్థిని తపస్విపై జ్ఞానేశ్వర్ అనే యువకుడు సర్జికల్ బ్లేడ్‌తో దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.
పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో దారుణం చోటుచేసుకుంది. బీడీఎస్ విద్యార్థిని తపస్విపై జ్ఞానేశ్వర్ అనే యువకుడు సర్జికల్ బ్లేడ్‌తో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన ఆమె గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తపస్విపై దాడి చేసిన తర్వాత యువకుడు తన చేయి కోసుకున్నాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పెదకాకాని పోలీసులకు అప్పగించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన నిందితుడు జ్ఞానేశ్వర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవల మనస్పర్థలు రావడంతో తక్కెళ్లపాడులోని ఓ దంత వైద్య కళాశాలలో చదువుతున్న తపస్వి స్నేహితురాలు... వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు తన వద్దకు పిలిచింది. దీంతో వారం రోజులుగా తపస్వి తన స్నేహితురాలి వద్దే ఉంటోంది.
ఈక్రమంలో ఆమెపై పగపెంచుకున్న జ్ఞానేశ్వర్ హతమర్చాలని పథకం వేసుకున్నాడు. సోమవారం తపస్వి స్నేహితురాలు ప్రేమికులిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయగా ఆ సమయంలో అతడు కోపోద్రిక్తుడై తపస్విపై సర్జికల్ బ్లేడ్‌తో గొంతు కోశాడు. పక్కనున్న స్నేహితురాలు కేకలు వేసి బయటకు వెళ్లడంతో స్థానికులు వచ్చారు. దీంతో జ్ఞానేశ్వర్ తలుపులు మూసేసి.. కొనఊపిరితో ఉన్న తపస్విని ఓ గది నుంచి మరో గదికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. స్థానికులు తలుపులు పగులగొట్టి ఆమెను 108 వాహనంలో తరలించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Video: ట్రాలీబ్యాగ్‌లో రూ.64లక్షల విలువైన విదేశీ కరెన్సీ తరలింపు.. ఎలా బయటకు లాగారో చూడండి!
-
India News
Indian Railways: ముంబయి- అహ్మదాబాద్ రైలు మార్గం.. 622 కి.మీల మేర కంచె నిర్మాణం!
-
Sports News
IND vs NZ: ‘వంద’ కోసం చెమటోడ్చిన టీమ్ఇండియా.. రెండో టీ20లో విజయం
-
Movies News
Harish Shankar: అందుకే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అప్డేట్లు ఇవ్వను: హరీశ్‌శంకర్ కామెంట్స్ వైరల్
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా
-
General News
CM Jagan: రెండ్రోజుల పాటు సీఎం జగన్ దిల్లీ పర్యటన