Kadapa: కడప నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణహత్య
ఎక్కువగా జన సంచారం ఉండే కడప నడిబొడ్డున ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
కడప (నేరవార్తలు): ఎక్కువగా జన సంచారం ఉండే కడప నడిబొడ్డున ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కడప పట్టణానికిచెందిన రేవంత్ (27), అభిలాష్ (29) స్నేహితులు. బుధవారం రాత్రి నగరంలోని సాయిబాబా థియేటర్‌కు సమీపంలోని రఘు బార్‌కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించి బయటకు వచ్చారు.
కాపు కాచిన నలుగురు యువకులు వారిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రేవంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన అభిలాష్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అభిలాష్ గురువారం ఉదయం మృతిచెందాడు. హత్యకు పాత గొడవలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Train Accidents: లాల్ బహదూర్ బాటలో... నడిచిన రైల్వే మంత్రులు వీరే
-
India News
Train Insurance: రూపాయి కన్నా తక్కువ చెల్లింపుతో రూ.10 లక్షల రైల్వే బీమా
-
Politics News
Nadendla Manohar: ‘సీట్ల సర్దుబాటుపై పవన్, చంద్రబాబు చర్చించుకుంటారు’
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది