Hyderabad News: నాగరాజు హత్య కేసు: ‘ఫైండ్‌ మై డివైస్‌’ ఆధారంగా చంపేశారు!

సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన నాగరాజు హత్య కేసులో ఇద్దరు నిందితుల ప్రమేయం మాత్రమే ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

Updated : 17 May 2022 13:36 IST

హైదరాబాద్‌: సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన నాగరాజు హత్య కేసులో ఇద్దరు నిందితుల ప్రమేయం మాత్రమే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. తన చెల్లి ఆశ్రిన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మొబిన్, అతడి బావ కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇద్దరు నిందితులను 5 రోజుల కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు... కీలక సమాచారం సేకరించారు. మొబిన్ తన జీమెయిల్‌కు పాస్‌వర్డ్‌గా మొబైల్‌ నంబర్‌ను పెట్టుకున్నాడు. నాగరాజు జీమెయిల్ ఐడీ పాస్‌వర్డ్‌ కూడా మొబైల్‌ నంబరే ఉండొచ్చని మొబిన్ ప్రయత్నించాడు.

నాగరాజు జీమెయిల్‌ను లాగిన్‌ చేసేందుకు అతడి మొబైల్‌ నంబర్‌ టైప్ చేసి మొబిన్ సఫలమయ్యాడు. సాధారణంగా మొబైల్‌ చోరీకి గురైన సమయాల్లో ఉపయోగించే ‘ఫైండ్ మై డివైస్’ ఆప్షన్‌తో నాగరాజు ఎక్కడున్నాడో తెలుసుకున్నాడు. నాగరాజు జీమెయిల్‌లో లాగిన్‌ అయి ‘ఫైండ్ మై డివైస్’తో అతడి కదలికలను మొబిన్ తెలుసుకున్నాడు. ఈనెల 4న పథకం ప్రకారం మాటు వేసి మొబిన్, అహ్మద్ కలిసి నాగరాజును హత్య చేశారు. ఇద్దరు నిందితులకు ఏ సంస్థతోనూ సంబంధాలు లేవని పోలీసులు తమ కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. కస్టడీ ముగియడంతో నిందితులను ఎల్బీ నగర్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇద్దరు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని