Nagpur Terror Plot: నాగ్​పుర్​ రెక్కీ కేసులో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్​

నాగ్​పుర్​లోని రెక్కీ కేసులో నలుగురు ఉగ్రవాదులను సీఆర్‌పీఎఫ్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్ట్​ చేశారు......

Updated : 10 Jan 2022 04:47 IST

నాగ్‌పుర్‌: మహారాష్ట్ర నాగ్​పుర్​లోని రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ (ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రధాన కార్యాలయం రెక్కీ కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను సీఆర్‌పీఎఫ్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్​ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ  జైషే మహ్మద్​కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించినట్లు నాగ్​పుర్​ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి జమ్ముకశ్మీర్​కు చెందిన నలుగురు ముష్కరులను అదుపులోకి తీసుకున్నారు.

ఆర్​ఎస్​ఎస్​ కార్యాలయంతో పాటు నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు జమ్ముకశ్మీర్​కు చెందిన ఓ యువకుడిని అరెస్ట్​ చేయగా.. నాగ్​పుర్​లో రెక్కీ విషయం తెలిసిందని వివరించారు. సదరు వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఆర్​పీఎఫ్​, జమ్ముకశ్మీర్​ పోలీసులు మరో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్​ చేశారని పేర్కొన్నారు. నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసినట్లు అమితేశ్​​ కుమార్​ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు