Phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. తిరుపతన్న, భుజంగరావు బెయిల్‌ పిటిషన్ల తిరస్కరణ

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది.

Published : 12 Jun 2024 17:47 IST

హైదరాబాద్‌: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషినల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.  రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్‌ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) కోర్టును కోరారు. బెయిల్‌ పిటిషన్లపై మంగళవారమే వాదనలు పూర్తికాగా.. ఈ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని