Hyderabad: మాదకద్రవ్యాల సరఫరా కేసు.. కీలక సూత్రధారి అరెస్టు

మాదకద్రవ్యాల సరఫరా కేసులో కీలక సూత్రధారిని నార్కోటిక్‌ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఎడ్విన్‌ను నార్కోటిక్‌ విభాగం పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాల సరఫరాలో ఎడ్విన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Published : 05 Nov 2022 11:44 IST

హైదరాబాద్: మాదకద్రవ్యాల సరఫరా కేసులో కీలక సూత్రధారిని నార్కోటిక్‌ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఎడ్విన్‌ను నార్కోటిక్‌ విభాగం పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాల సరఫరాలో ఎడ్విన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నారాయణ బోర్కర్ అనే వ్యక్తిని మూడు నెలల క్రితం నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ హైదరాబాద్‌లో సరఫరా చేయడంలో నారాయణ బోర్కర్‌ది కీలక పాత్ర. తను ఇచ్చిన సమాచారం మేరకు నార్కోటిక్‌ విభాగం పోలీసులు గోవాలో పలువురిపై నిఘా పెట్టారు. గత మూడు నెలలుగా ఎడ్విన్ తప్పించుకొని గోవాలో తిరుగుతున్నాడు. పక్కా ప్రణాళికతో 15 రోజులుగా అక్కడే ఉండి స్థానిక పోలీసులు ఎడ్విన్‌పై నిఘా పెట్టారు. ఎట్టకేలకు ఎడ్విన్‌ను పట్టుకున్న పోలీసులు ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని