Crime news: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పట్టుబడిన మాదకద్రవ్యాలు ధ్వంసం

 రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పట్టుబడిన మాదకద్రవ్యాలను పోలీసులు డిస్పోజ్‌ చేశారు. 

Published : 08 Jul 2024 22:33 IST

హైదరాబాద్‌: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పట్టుబడిన మాదకద్రవ్యాలను పోలీసులు డిస్పోజ్‌ చేశారు. వాటి విలువ రూ.5 కోట్లకు పైగానే ఉంటుందని పోలీసులు తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని 23 పోలీస్ స్టేషన్లలో గత ఏడాది 106 కేసులు నమోదు చేయగా.. భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. అందులో 3,484.4 కేజీల గంజాయి, 402.2 కేజీల నల్లమందు, 14 గ్రాముల ఎం.డి.ఎం.ఏ, 3.5 కేజీల హశీష్‌, 5 గ్రాముల సైకోట్రోపిక్ పదార్థం, 100 గ్రాముల గంజాయి చాక్లెట్లు ఉన్నాయి. నిందితుల నుంచి మొత్తం 3,891.8 కేజీల నార్కోటిక్ పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ పర్యవేక్షణలో యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపూర్ గ్రామంలో వాటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇందుకోసం కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీస్ ప్లాంట్‌ను వినియోగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని