Published : 15 Jul 2021 01:39 IST

కేకుల్లో డ్రగ్స్‌ కుక్కి.. అడ్డంగా పోలీసులకు చిక్కి..!

సైకాలజిస్టు అంటూ నార్కొటిక్‌ డ్రగ్స్‌ అమ్మకాలు

ముంబయి: మనుషుల మసస్తత్వం, ప్రవర్తనపై అధ్యయనం చేసి వారిని మామూలుగా మార్చాల్సిన ఓ సైకాలజిస్టు డబ్బుకోసం అడ్డదారిలో వెళ్లి పోలీసులకు చిక్కాడు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న రహమీన్‌ చరాణియా (25) ఓ బేకరీ ప్రారంభించి కేకుల్లో డ్రగ్స్‌ పెట్టి సరఫరా చేస్తూ దొరికిపోయాడు. ఇటీవల ఎన్సీబీ (నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో) అధికారులు సోదాలు నిర్వహించగా కేకులు, బ్రౌనీల్లో డ్రగ్స్‌ అమ్మకాలు చేస్తున్నాడని, వాటిని రేవ్‌ పార్టీలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ మాట్లాడుతూ.. ‘‘చూడటానికి కేకుల్లా కనిపించినా ఇందులో డ్రగ్స్‌ నింపాడు. అవన్నీ ప్యాక్‌ చేసి డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. అలా 10 కిలోల కేకుల్లో డ్రగ్స్‌ ఉన్నట్టు గుర్తించాం. జనాలను ఆకట్టుకునేందుకు రెయిన్‌బో కేకులని చెప్పి అందులోని తయారు చేసే మైదాపిండిలో మాదకద్రవ్యాలను కలిపాడు. అతడి ఇంట్లోనూ రూ.1.7లక్షలు విలువజేసే ఓపీఎమ్‌ డ్రగ్‌ స్వాధీనం చేసుకున్నాం’’ అని వివరించారు. 

వెబ్ సిరీస్‌ చూసి ఇలా..
విచారణలో భాగంగా నిందితుడిని పోలీసులు ప్రశ్నించగా.. విస్తుపోయే నిజాలుబయటకు వచ్చాయి. ‘‘నేను ఎక్కువగా ఓటీటీల్లో వచ్చే అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌ చూస్తాను. అందులో డగ్స్‌ను కేకుల్లోపెట్టి సరఫరా చేయడం క్షుణ్ణంగా పరిశీలించా. ఆ మార్గాన్నే ఇక్కడా అనుసరించా’’ అంటూ చెప్పుకొచ్చాడు. డ్రగ్స్‌ విక్రయానికి 
సోషల్‌ మీడియాని వేదికగా చేసుకొని ఆర్డర్లు స్వీకరించేవాడు. సౌత్‌, వెస్ట్‌ ముంబయిలో వ్యాపారాన్ని విస్తృతం చేసి రమ్‌జాన్‌ షేక్‌ అనే వ్యక్తిని  సహాయకుడిగా నియమించుకోగా.. పోలీసులు అతడిని కూడా పట్టుకున్నారు.  అయితే, కేకుల రూపంలో డ్రగ్స్‌ వ్యాపారం చేయడం కొత్త కాదని, గతంలో పశ్చిమ ముంబయిలో ఎన్సీబీ నిర్వహించిన సోదాల్లో కొందరిని అరెస్టు చేసినట్టు తెలిపారు. కాలేజీ రోజుల్లో డ్రగ్స్‌ వ్యాపారం చేసేవాడని, డబ్బు సంపాదించాలనే ఆశ పెరగడంతో అక్రమంగా సంపాదించేందుకుగతంలో చేసిన డ్రగ్స్‌ వ్యాపారాన్నే మళ్లీ ఎంచుకున్నాడని వివరించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని