Drugs: రూ. 879 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

అఫ్గానిస్థాన్ నుంచి భారీ మెుత్తంలో హెరాయిన్ తరలిస్తున్న ఓ స్మగ్లర్‌ను మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ. 879 కోట్ల విలువైన 300 కేజీల హెరాయిన్ స్వాధీనం....

Published : 05 Jul 2021 01:00 IST

ముంబయి: అఫ్గానిస్థాన్ నుంచి భారీ మెుత్తంలో హెరాయిన్ తరలిస్తున్న ఓ స్మగ్లర్‌ను మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ. 879 కోట్ల విలువైన 300 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇరాన్, అఫ్గానిస్థాన్ నుంచి అక్రమంగా తరలించిన సరకును జిప్సమ్ స్టోన్, టాల్కమ్ పౌడర్‌గా అధికారులు గుర్తించారు. 

ఈ సరకును సరఫరా చేస్తున్న ప్రబ్‌జోత్‌సింగ్ అనే నిందితుడిని రాయ్‌గఢ్ సమీపంలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌టీ) సమీపంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఏడాది నుంచి నిందితుడు మత్తు పదార్థాల దందా కొనసాగిస్తున్నట్లు తెలిసిందని అధికారులు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులోనూ ఆయుర్వేదిక్ మందుల పేరిట హెరాయిన్ సరఫరా చేస్తున్న కంటైనర్‌ను డీఆర్‌ఐ బృందాలు గుర్తించాయి. రూ.1000 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను సీజ్ చేశాయి. అప్పుడు కూడా ఆ మత్తు పదార్థాలు అఫ్గాన్‌ నుంచే సరఫరా అయినట్లు డీఆర్‌ఏ అధికారులు వెల్లడించారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని