Andhra News: నెల్లూరు కోర్టులో చోరీ.. పాత సామాన్ల దొంగల పనే: ఎస్పీ విజయరావు

నెల్లూరు కోర్టు సముదాయంలో జరిగిన చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశామని జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాలు సహా పూర్తి ఆధారాలతో కేసును ఛేదించామని చెప్పారు.

Updated : 17 Apr 2022 16:28 IST

నెల్లూరు: నెల్లూరు కోర్టు సముదాయంలో జరిగిన చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశామని జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాలు సహా పూర్తి ఆధారాలతో కేసును ఛేదించామని చెప్పారు. దొంగలు కోర్టులో సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకుని మిగతా పేపర్లను పడేశారని తెలిపారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు దర్యాప్తు వివరాలను ఎస్పీ వెల్లడించారు. కంప్యూటర్లు, ఇనుప, పాత సామాన్లు దొంగతనం చేసే ముఠాలోని ఇద్దరు వ్యక్తులు చోరీ చేసినట్లు చెప్పారు.

‘‘బెంచ్‌ క్లర్క్‌ నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. నిందితులు సయ్యద్‌ హయత్‌, ఖాజా రసూల్‌పై 14 కేసులున్నాయి. ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద నిందితులను అరెస్ట్‌ చేశాం. నిందితుల నుంచి ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, 4 సెల్‌ఫోన్లు, 7 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నాం. పక్కా ఆధారాలతో నిందితులను అరెస్ట్‌ చేశాం. పొలిటికల్ రూమర్స్‌ గురించి మాట్లాడబోం.. ఆధారాలతో మాత్రమే మాట్లాడతాం’’ అని ఎస్పీ వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని