Lucknow: నర్సు చేతిలోంచి జారిపడి అప్పుడే పుట్టిన శిశువు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. నర్సు నిర్లక్ష్యానికి ఓ పసికందు ప్రాణం పోయింది.......

Published : 27 Apr 2022 01:40 IST

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. నర్సు నిర్లక్ష్యానికి ఓ పసికందు ప్రాణం పోయింది. నర్సు చేతిలోంచి జారిపోయి అప్పుడే పుట్టిన శిశువు మృతిచెందాడు. చింతన్‌ ప్రాంతంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే టవల్‌ సాయం లేకుండా శిశువును నర్సు ఒంటి చేత్తో ఎత్తుకోవడంతో ఆ శిశువు జారి కిందపడిపోయాడు. దీంతో తలకు గాయమై మృతిచెందాడు.

ఇది చూసిన తల్లి ఆర్తనాదాలు పెట్టడంతో భయాందోళనకు గురైన కుటుంబీకులు డెలివరీ రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని అడ్డుకున్న ఆసుపత్రి సిబ్బంది.. మృత శిశువు జన్మించిందని బుకాయించే ప్రయత్నం చేశారు. శిశువు ఆరోగ్యంగానే పుట్టాడని, నర్సు తప్పిదం వల్లే కిందపడి మృతిచెందినట్లు సదరు తల్లి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తలకు గాయం కారణంగానే శిశువు మరణించినట్లు నివేదికలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని