
NIA: మావోయిస్టులతో సంబంధాలు... హైదరాబాద్‌లో ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్ఐఏ
హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్పను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. 3 ఏళ్ల క్రితం తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని 2017 డిసెంబరులో విశాఖలోని పెదబయలు పీఎస్‌లో రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంఎస్ నాయకులు... రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఆమె తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప, తదితరులు తమ నివాసానికి వచ్చేవారని తెలిపారు. వైద్యం పేరుతో దేవేంద్ర.. రాధను తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
విశాఖ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు శిల్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇవాళ ఉదయం ఉప్పల్ చిలుకానగర్‌లోని శిల్ప నివాసంలో, చైతన్య మహిళా సంఘం కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు డిజిటల్ సామగ్రి, మావోయిస్టు భావజాల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడి ఇంట్లో తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించారు. గతంలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ప్రభాకర్ భార్య, న్యాయవాది దేవేంద్రను మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పర్వతాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. దేవేంద్ర, స్వప్న, శిల్ప ముగ్గురూ మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
Kerala: కేరళలోని దుకాణంలో ఆసక్తికరమైన చోరీ..
-
Ap-top-news News
TS TET Results 2022: తెలంగాణ టెట్‌లో ప్రకాశం యువతికి మొదటి ర్యాంకు
-
Related-stories News
Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
-
Ts-top-news News
Hyderabad News: భాజపాకు రూ.20 లక్షలు.. తెరాసకు రూ.3 లక్షలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Assigned: ఎసైన్డ్ వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులు?