TS News: ఐదు జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు

తెలంగాణలోని ఐదు జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసులో మహబూబ్‌నగర్‌........

Published : 20 Jul 2021 01:54 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని ఐదు జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసులో మహబూబ్‌నగర్‌, వరంగల్‌, జనగామ, భద్రాద్రి, మేడ్చల్‌ జిల్లాల్లోని పలువురి ఇళ్లల్లో అధికారులు సోమవారం సోదాలు జరిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ముత్తు నాగరాజు, వి.సతీశ్‌ ఇళ్లల్లో సోదాలు చేయగా.. మేడ్చల్‌లో కొమ్మరాజు కనకయ్య, భద్రాద్రిలో గుంజి విక్రమ్‌, త్రినాథరావు, జనగామలో సూర సారయ్య, వరంగల్‌లో వేలుపు స్వామి నివాసాల్లో సోదాలు జరిగాయి.

ఈ సందర్భంగా 400 ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు, 500 నాన్‌ ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లతో పాటు 400 జిలెటిన్‌ స్టిక్స్‌, 549 మీటర్ల ఫ్యూజ్‌ వైర్లు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మావోయిస్టు నేతలకు వీటిని ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టుకున్నట్టు ఎన్‌ఐఏ వెల్లడించింది. ఐఈడీ, గ్రనేడ్‌ లాంఛర్ల తయారీకి అవసరమైన సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి పలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని