Mulugu: రోడ్డు ప్రమాదంలో నిట్‌ విద్యార్థిని దుర్మరణం.. ఐదుగురికి తీవ్ర గాయాలు

ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది.

Updated : 21 Sep 2023 11:34 IST

ములుగు: ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ వద్ద అతివేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఆపై లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వరంగల్‌ నిట్‌ విద్యార్థిని నిస్సీ మృతి చెందింది. మరో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను హైదరాబాద్‌కు చెందిన సాయి, సుజిత్, ముర్తుజా, ఉమర్, విశాఖకు చెందిన శ్రేయగా గుర్తించారు. కాగా, మృతురాలు నిస్సీ స్వస్థలం విశాఖ. వీరంతా లక్నవరం విహారయాత్రకి వెళ్లి వస్తుండగా, ఇవాళ తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని