కరాటే శిక్షణ ముసుగులో సంఘవిద్రోహ చర్యలు.. నిజామాబాద్‌లో ముగ్గురి అరెస్టు

సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు పీఎఫ్‌ఐ సభ్యులను నిజామాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 06 Jul 2022 22:05 IST

నిజామాబాద్‌: సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు పీఎఫ్‌ఐ సభ్యులను నిజామాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. కరాటే శిక్షణ ముసుగులో, లీగల్‌ అవేర్‌నెస్‌ క్యాంప్‌ల పేరుతో మరో వర్గంపై వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తున్నారని సీపీ నాగరాజు వెల్లడించారు. యువతను పీఎఫ్‌ఐ ఎంపిక చేసుకుంటోందని తెలిపారు. సిమీపై నిషేధం విధించిన తర్వాత పీఎఫ్ఐ పుట్టుకొచ్చిందని, ఈ సంస్ధకు చెందిన వారు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని నిజామాబాద్‌ సీపీ వెల్లడించారు. సమయం వచ్చినప్పుడు మత కల్లోలాలు సృష్టించడం, మానవ విస్ఫోటనంగా మార్చడమే ఈ శిక్షణ ఉద్దేశమని పేర్కొన్నారు. నిజామాబాద్‌తో పాటు కర్నూలు, కడప, వివిధ ప్రాంతాల నుంచి యువకులు వచ్చి కరాటే పేరుతో ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారని దర్యాప్తులో తేలిందన్నారు. నిజామాబాద్‌లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మతపరమైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని