Prithviraj: సినీనటుడు పృథ్వీరాజ్‌పై అరెస్టు వారెంట్‌

భార్యకు మనోవర్తి చెల్లింపు కేసులో న్యాయస్థానం ఎదుట గైర్హాజరైన సినీ నటుడు పృథ్వీరాజ్‌పై విజయవాడ ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

Published : 14 Jun 2024 05:58 IST

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: భార్యకు మనోవర్తి చెల్లింపు కేసులో న్యాయస్థానం ఎదుట గైర్హాజరైన సినీ నటుడు పృథ్వీరాజ్‌పై విజయవాడ ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. పృథ్వీపై అతని భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మి.. విజయవాడ ఫ్యామిలీ కోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు.. ఆమెకు నెలకు రూ.8లక్షలు మనోవర్తిగా చెల్లించాలని ఆదేశించింది. దీనిపై పృథ్వీరాజ్‌ హైకోర్టును ఆశ్రయించారు. నెలకు రూ.22వేలు చెల్లించడంతో పాటు అప్పటివరకు ఉన్న బకాయిలు కూడా అందజేయాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పృథ్వీరాజ్‌ పాటించలేదని ఆరోపిస్తూ భార్య శ్రీలక్ష్మి.. ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్టులో మరోసారి పిటిషన్‌ వేశారు. ఈ కేసు విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తూ న్యాయమూర్తి కె.సునీత బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణను జులై 15కు వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని