Hyderabad: డేటా చోరీ కేసులో ప్రముఖ సంస్థలకు నోటీసులు

డేటా చోరీ కేసులో బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు, ఐటీ కంపెనీలు, ఓటీటీ, ఈ కామర్స్‌ వెబ్‌సైట్లు, ఈ లెర్నింగ్ సెంటర్లుకు సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు పంపారు.

Published : 02 Apr 2023 17:30 IST

హైదరాబాద్‌: డేటా చోరీ కేసులో పలు కంపెనీలకు సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు, ఐటీ కంపెనీలు, ఓటీటీ, ఈ కామర్స్‌ వెబ్‌సైట్లు, ఈ లెర్నింగ్ సెంటర్లకు నోటీసులు పంపారు. అలాగే బిగ్‌ బాస్కెట్‌, ఫోన్‌ పే, ఫేస్‌ బుక్‌, పాలసీ బజార్‌, యాక్సిస్‌ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రాతో పాటు పలు కంపెనీలకు నోటీసులు పంపించారు. వినియోగదారుల డేటా లీకేజీకి సంబంధించి సదరు కంపెనీల నుంచి వివరణ కోరారు.

20అంశాలతో కూడిన లేఖలు రాయాలని నిర్ణయం

డేటా చోరీ కేసు బయటపడటంతో సైబరాబాద్‌ పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలు రూపొందించారు. పలు కంపెనీలకు లేఖలు రాయాలని నిర్ణయించారు. డేటా బయటకు వెళ్లకుండా వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని విషయాలపై అవగాహన కల్పించే విధంగా అంశాలను రూపొందించారు. ఇందులో భాగంగా 20 అంశాలతో కూడిన లేఖలను పలు కంపెనీలకు పంపనున్నారు. కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి అవగాహన కలిగేలా కార్యక్రమం నిర్వహించాలని యాజమాన్యాలకు సూచించనున్నారు. ఇన్‌ఫర్మేషన్ యాక్టులో నిబంధనలు అమలయ్యేలా సైబరాబాద్‌ పోలీసులు దృష్టి సారించారు. వినియోగదారులు తమ మొబైల్‌ నెంబర్, ఆధార్‌ కార్డు ఇతర విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. ప్లే స్టోర్‌ నుంచి అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. మొబైల్‌ సెట్టింగ్‌లోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు