Hyderabad: మణికొండలో కేవ్‌ పబ్‌పై టీజీ న్యాబ్ అధికారుల దాడులు

మణికొండలోని కేవ్ పబ్‌లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు సోదాలు చేశారు.

Updated : 07 Jul 2024 08:37 IST

హైదరాబాద్‌: మణికొండలోని కేవ్ పబ్‌లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు సోదాలు చేశారు. పబ్‌లో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారంతో ఆకస్మిక దాడులు చేశారు. 50 మందిని అదుపులోకి తీసుకొని వారికి పరీక్షలు నిర్వహించారు. అందులో 24 మంది మాదకద్రవ్యాలు స్వీకరించినట్లు నిర్ధరణ అయింది. డీజే ఆపరేటర్‌తో కలిసి పబ్‌ నిర్వాహకులు డ్రగ్స్‌ అమ్మినట్లు గుర్తించారు. అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని