11మంది మహిళల్ని చంపిన సీరియల్‌ కిల్లర్‌.. చివరకు! 

ఒకరు.. ఇద్దరు కాదు.. మొత్తం 11 మంది మహిళల్ని హతమార్చిన కేసులో మరణ శిక్ష పడిన ఓ సీరియల్‌ కిల్లర్‌ అంతుచిక్కని ....

Updated : 10 Feb 2021 05:13 IST

క్లేవ్‌లాండ్‌: 11 మంది మహిళల్ని హతమార్చిన కేసులో మరణశిక్ష పడిన ఓ సీరియల్‌ కిల్లర్‌ అంతుచిక్కని రోగంతో మరణించాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఒహైయోకి చెందిన ఆంటోనీ సోవెల్‌ (61)కి మహిళల్ని చంపి ఇంటి పరిసరాల్లో దాచిపెట్టిన కేసులో మరణశిక్ష పడింది. అయితే, కారాగారంలో ఉన్న అతను అంతుబట్టని రోగానికి గురైన సోమవారం  ప్రాణాలు విడిచినట్టు అధికారులు తెలిపారు. అతడి మరణానికి కరోనా కారణం కాదని స్పష్టంచేశారు. వివరాల్లోకి వెళ్తే.. 2009 అక్టోబర్‌లో  పోలీసులు ఓ అత్యాచారం కేసులో సోవెల్‌ను విచారించారు. ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో సోదాలు చేయగా.. రెండు మృతదేహాలను గుర్తించారు. ఆ తర్వాత మరింత విస్తృతంగా గాలించిన పోలీసులు 11మంది మహిళల అవశేషాలను వెలికితీశారు.

మహిళల్ని చంపిన కేసులో అరెస్టయిన సోవెల్‌పై నేరం రుజువు కావడంతో 2011లో మరణ శిక్ష పడింది. మహిళల్ని చంపిన కేసుతో పాటు ఇద్దరు మహిళలపై అత్యాచారం, మరొకరిపై అత్యాచారయత్నం కేసులో కూడా న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. జైలులో ఉన్న సోవెల్‌.. తనకు కింది కోర్టు విధించిన శిక్షపై పదేపదే అప్పీల్‌కు చేస్తూ వచ్చాడు. తనపై నేర విచారణ నిష్పక్షపాతంగా జరగలేదంటూ పిటిషన్‌ వేశాడు. దీనిపై గతేడాది మే నెలలో ముగ్గురు న్యాయమూర్తుల ప్యానల్‌ విచారించి.. అతడు చేస్తున్న ఆరోపణలపై సరైన ఆధారాలను సమర్పించడంలో విఫలమయ్యాడని పేర్కొంది. ఆరోపణలపై ఆధారాల్లేవని కొట్టివేసింది. అలాగే, తనకు శిక్ష నుంచి మినహాయింపు కోరుతూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా  కొట్టివేసింది.

ఇదీ చదవండి..

నార్సింగి హత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని