రైలు ఇంజిన్‌కు వేలాడుతూ వచ్చిన మృతదేహం.. ఘట్‌కేసర్‌ వద్ద ఘటన

ఘట్‌కేసర్‌: పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధుడిని ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టింది. బీబీనగర్‌-ఘట్‌కేసర్‌ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 03 Jul 2024 08:58 IST

ఘట్‌కేసర్‌: పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధుడిని ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టింది. బీబీనగర్‌-ఘట్‌కేసర్‌ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ క్రమంలో రైలు ఇంజిన్‌ ముందు భాగంలో చిక్కుకున్న మృతదేహం.. ఘట్‌కేసర్‌ వరకు సుమారు 5 కి.మీ వేలాడుతూ వచ్చింది. అక్కడి రైల్వేగేటు వద్ద రైలు ఇంజిన్‌కు చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘట్‌కేసర్‌ దాటాక రైలు ఆపించిన ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది.. మృతదేహాన్ని తొలగించారు. మృతిచెందిన వృద్ధుడు నీలం రంగు చొక్కా, ఆరెంజ్‌ లుంగీ, కుడిచేతికి కడియం ధరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్యాసింజర్‌ రైలు వరంగల్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని