Viral news: ప్రేయసి దూరం... నడిరోడ్డుపై తుపాకీతో కాల్చుకొని టీనేజర్ ఆత్మహత్య
తన ప్రేయసి వేరే యువకుడ్ని పెళ్లి చేసుకుందని మనస్తాపం చెందిన 17 ఏళ్ల టీనేజర్ నడిరోడ్డుపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గన్‌తో షూట్ చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
జైపూర్: తన ప్రేయసి వేరే యువకుడ్ని పెళ్లి చేసుకుందని మనస్తాపం చెందిన 17ఏళ్ల టీనేజర్ నడిరోడ్డుపై ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డాడు. గన్‌తో షూట్ చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్(Rajasthan)లోని భిల్వారా జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక మహాత్మాగాంధీ ఆస్పత్రి రోడ్డులో గురువారం రాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యష్ వ్యాస్ అనే యువకుడు తలపై గన్‌తో కాల్చుకొని కుప్పకూలాడు. అటుగా వెళ్తున్నవారు గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉదయ్‌పూర్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యష్ వ్యాస్, అతడు ప్రేమించిన బాలిక ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఆత్మహత్యకు ముందు తాను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో సోషల్ మీడియాలో యువకుడు తెలిపాడు. తన ప్రేమికురాలి వివాహంతో తీవ్ర మనోవేదనకు గురయ్యానని చెప్పుకొచ్చాడు. దీని ఆధారంగా అతడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్థారించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Sports News
Ajinkya Rahane: ఐపీఎల్-15 సీజన్ తర్వాత లీసెస్టర్‌షైర్‌కు ఆడనున్న అజింక్య రహానె
-
Crime News
Crime News: అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వెడ్డింగ్ ఫీవర్’.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు
-
Politics News
YSRCP: ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిరూపిస్తా: వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి