
Road Accident: కిడ్నాప్ అయిన బాలికను రక్షించేందుకు వెళ్తూ.. అయిదుగురి దుర్మరణం
లఖ్‌నవూ: అపహరణకు గురైన బాలికను రక్షించేందుకు వెళ్తుండగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసులతోసహా అయిదుగురు మృతి చెందారు. ఉత్తర్‌ప్రదేశ్ మథురాలోని యమునా ఎక్స్‌ప్రెస్ వేపై శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ తికమ్గఢ్ జిల్లాలోని బుదేరా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు సిబ్బంది.. స్థానికంగా కిడ్నాప్ అయిన ఓ బాలికను రక్షించేందుకు హరియాణాలోని బహదుర్గఢ్కు ఎస్‌యూవీలో బయల్దేరారు. బాలికను కాపాడేందుకు సాయంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరిని తీసుకెళ్లారు.
మార్గమధ్యంలో మథుర వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టినట్లు తికమ్గఢ్ అదనపు ఎస్పీ ఎంఎల్ చౌరాసియా తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో హెడ్ కానిస్టేబుల్ భవానీ ప్రసాద్(52), కానిస్టేబుళ్లు హీరాదేవి ప్రజాపతి(32), కమలేంద్ర యాదవ్(28)తోపాటు వారికి సాయంగా వెళ్తున్న ప్రీతి, ధర్మేంద్ర కూడా మృతిచెందినట్లు ఏఎస్పీ వెల్లడించారు. ఇదే ఘటనలో హెడ్ కానిస్టేబుల్‌తోపాటు డ్రైవర్, మరొకరికి గాయాలైనట్లు చెప్పారు. ఈ ముగ్గురిని వెంటనే మథురలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.