AP News: వైఎస్సార్‌ జిల్లాలో పోలీసుల తనిఖీలు.. కారులో తరలిస్తున్న రూ.1.5 కోట్లు స్వాధీనం

వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం జయరాజ్‌ గార్డెన్స్‌ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Published : 01 Jun 2024 10:43 IST

కడప నేర వార్తలు: వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం జయరాజ్‌ గార్డెన్స్‌ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న రూ.1.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన తిరుమలయ్య అనే బంగారు వ్యాపారి నగదును చెన్నైకి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి బిల్లులు లేకపోవడంతో ఆయన వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై డీఎస్పీ బృందం దర్యాప్తు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని