హైదరాబాద్‌ వచ్చేందుకు పాకిస్థానీ యువతి యత్నం.. నగర పోలీసుల ఆరా..

పాకిస్థాన్‌కు చెందిన మహిళను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన కేసులో.. బిహార్ పోలీసులు అరెస్టు చేసిన మహమూద్ వివరాలను హైదరాబాద్ పోలీసులు

Updated : 11 Aug 2022 14:57 IST

హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన మహిళను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన కేసులో.. బిహార్ పోలీసులు అరెస్టు చేసిన మహమూద్ వివరాలను హైదరాబాద్ పోలీసులు సేకరిస్తున్నారు. బిహార్ పోలీసులను సంప్రదించడంతో పాటు.. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులతోనూ మాట్లాడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని బహదూర్‌పుర పీఎస్ పరిధిలో ఉండే అహ్మద్.. సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన ఖాదియా నూర్‌తో పరిచయం ఏర్పడింది. మహిళను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న అహ్మద్.. ఆమెను హైదరాబాద్ తీసుకురావాలనుకున్నాడు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న తన సోదరుడు మహమూద్‌కు తెలిపాడు.

పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీని కోసం అహ్మద్‌తో పాటు సౌదీలో పనిచేస్తున్న నేపాలీ వ్యక్తి జీవన్‌ సాయం చేస్తానన్నాడు. ఖాదియా నూర్ పాకిస్థాన్ నుంచి నేపాల్ చేరుకొని జీవన్‌ను కలిసింది. అతడు ఖాదియాను బిహార్ సరిహద్దుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) పోలీసులు తనిఖీ చేయగా.. ఆమె వద్ద నకిలీ ఆధార్ ఉన్నట్లు గుర్తించారు. ఆమెను ప్రశ్నించగా పాక్ యువతిగా తెలిపింది. అహ్మద్‌ సోదరుడు మహమూద్ సూచన మేరకు ఖాదియాను తీసుకొచ్చినట్లు జీవన్ పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు ఖాదియా నూర్, జీవన్, మహమూద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అహ్మద్‌కు ఖాదియాతో ఎప్పటి నుంచి పరిచయం ఉందనే వివరాలను హైదరాబాద్ పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts