Telangana news: అధికారులను అడ్డుకున్న రైతులు..!

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఇల్లు కోల్పోయిన బాధితులకు పునరావాసం కోసం స్థల సేకరణకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలో స్థల సేకరణ చేయడానికి పోలీసుల సాయంతో, పటిష్టమైన బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు

Published : 05 Apr 2022 08:37 IST

నాగర్‌కర్నూల్‌: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఇల్లు కోల్పోయిన బాధితులకు పునరావాసం కోసం స్థల సేకరణకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలో స్థల సేకరణ చేయడానికి పోలీసుల సాయంతో, పటిష్టమైన బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులు, స్థానిక రైతుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. రైతులను బలవంతంగా ఎత్తు కెళ్ళి వాహనాల్లో పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉన్న కొద్ది భూములలో వ్యవసాయం చేసుకొని బతుకుతుంటే దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి ఒకదఫా వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంటున్నారు. భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని, అయితే ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మాత్రం సరిపోదంటున్నారు. ఎకరాకు రూ.1.8 లక్షలు ఇస్తామనడం న్యాయమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన పరిహారం చెల్లింస్తామనడం సబబుగా లేదంటున్నారు. గతంలో ఇచ్చిన మాదిరిగా మాకు పరిహారం అందిస్తే ప్రభుత్వానికి సహకరిస్తామంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని