Updated : 28 May 2022 19:49 IST

Panchayat Secretary : అధికారుల వేధింపులు తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

సిద్దిపేట: అధికారుల వేధింపులు తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.  నంగునూరు ఎంపీడీవో మధుసూదన్ వేధింపులకు గురి చేస్తున్నారని మనస్తాపానికి గురైన పాలమాకుల పంచాయతీ కార్యదర్శి రామ్ ప్రసాద్  ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రామ్ ప్రసాద్ ను ఓ వ్యవసాయ క్షేత్రం వద్ద గుర్తించిన అతని స్నేహితులు వెంటనే  ఆసుపత్రికి తరలించారు. అధికారులు వేధిస్తున్నారని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీడీవో తమను ఎక్కువ పని చేయాలని ఆదేశిస్తున్నారని, వేరే వాళ్ల పని సైతం చేయాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని చేయాల్సిందే, లేకుంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలన్నారని తెలిపారు. మధుసూదన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీ కార్యదర్శులకు పని భారం తగ్గించాలన్నారు.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని