Crime News: అనంతలో దుండగుల దుశ్చర్య.. ఓటమి అక్కసుతో తాగునీటి ట్యాంకులో పురుగుల మందు

అనంతపురం జిల్లా కనేకల్‌ మండలం తుంబిగనూరు గ్రామంలో శుద్ధజల నీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు  పురుగుల మందు కలిపి విషప్రయోగానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Published : 15 Jun 2024 11:16 IST

కనేకల్‌: అనంతపురం జిల్లా కనేకల్‌ మండలం తుంబిగనూరు గ్రామంలో శుద్ధజల నీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపి విషప్రయోగానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  దీంతో గ్రామానికి విడుదల చేసే తాగునీటి సరఫరాను ఆపేశారు. ఈ మేరకు పోలీసులకు గ్రామస్థులు సమాచారం అందించారు. ఎస్సై శ్రీనివాసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని తాగునీటి ట్యాంకును పరిశీలించారు. 

శుక్రవారం అర్ధరాత్రి ట్యాంకు వద్ద నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను పారిపోవడాన్ని గ్రామస్థులు గమనించారు. అనుమానంతో ట్యాంకు వద్ద పరిశీలించగా లిక్విడ్‌ ఆనవాళ్లను గుర్తించారు. తెదేపా ఎన్నికల్లో విజయం సాధించిదన్న అక్కసుతోనే గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పొరపాటున నీరు తాగి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని