లైంగిక దాడి నుంచి ఓనర్‌ను కాపాడిన శునకం

అపాయం నుంచి ఇంటి యజమానురాలిని కాపాడి విశ్వాసం చాటుకుందో పెంపుడు శునకం. మహిళపై లైంగిక దాడి చేసే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని పసిగట్టి పదే పదే బిగ్గరగా............

Published : 01 Nov 2020 01:33 IST

ముంబయి: అపాయం నుంచి ఇంటి యజమానురాలిని కాపాడి విశ్వాసం చాటుకుందో పెంపుడు శునకం. మహిళపై లైంగిక దాడి చేసే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని పసిగట్టి పదే పదే బిగ్గరగా అరుస్తూ పట్టించింది. ముంబయిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని పొవాయ్‌ ప్రాంతంలో 33 ఏళ్ల మహిళ తన ఏడేళ్ల కూతురితో అద్దెంట్లో నివాసం ఉంటున్నారు. ఆమె ఓ శునకాన్ని పెంచుకుటున్నారు. ఇటీవలే ఆమె భర్త మరణించాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే సర్దార్‌ ఆలం అనే 25 ఏళ్ల వ్యక్తి మహిళతో స్నేహానికి ప్రయత్నించగా ఆమె తిరస్కరించారు. దీంతో కక్ష పెట్టుకున్న నిందితుడు ఆమెపై లైంగిక దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం కిటికీలోంచి ఆమె ఇంట్లోకి షర్ట్‌ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా ప్రవేశించాడు. పసిగట్టిన పెంపుడు శునకం పదే పదే బిగ్గరగా అరుస్తూ అప్రమత్తం చేసింది. దీంతో ఆ మహిళ ఇంట్లో సర్దార్‌ ఆలంను గుర్తించి అలారం మోగించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం అతడిని అరెస్టు చేసిన కోర్టులో హాజరు పరిచిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని