HYD: ఫార్మసీ విద్యార్థినిపై హత్యాయత్నం

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఫార్మసీ విద్యార్థినిని ఓ ఆటోడ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు‌ కిడ్నాప్‌ చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. యువతి కళాశాల నుంచి ఇంటికి వెళ్తుండగా బలవంతంగా జోడిమెట్ల దగ్గర పొదల్లోకి తీసుకెళ్లి హత్యాయత్నం చేశారు. 

Updated : 11 Feb 2021 06:27 IST

హైదరాబాద్‌‌: మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఫార్మసీ విద్యార్థినిని ఓ ఆటోడ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు‌ కిడ్నాప్‌ చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. యువతి కళాశాల నుంచి ఇంటికి వెళ్తుండగా బలవంతంగా జోడిమెట్ల దగ్గర పొదల్లోకి తీసుకెళ్లి హత్యాయత్నం చేశారు.  యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని మేడిపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి..

వరంగల్‌ జిల్లాలో విషాదం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు