Phone tapping: ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో సంయమనం పాటించండి: హైకోర్టు

ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో సంయమనం పాటించాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

Updated : 10 Jul 2024 16:22 IST

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో సంయమనం పాటించాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్దాంతం చేయొద్దని, జడ్జిలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు బహిర్గతం చేయొద్దని స్పష్టం చేసింది. ఫోన్‌ నంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 23కి వాయిదా వేసింది.

రాజకీయ నేతలతో పాటు జడ్జిల ఫోన్లు ట్యాప్‌ చేశారని పత్రికల్లో కథనాలు రావడంతో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. కేసు విచారణ జరుగుతోందని, నిందితులను అరెస్టు చేసినట్టు కౌంటర్‌లో పేర్కొంది. పలువురు పోలీసు అధికారుల ఫోన్లు సైతం ట్యాపింగ్‌ చేసినట్టు తెలిపింది. ఈ వ్యవహారంపై బుధవారం మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని