Pinnelli: నెల్లూరు సెంట్రల్‌ జైలుకు పిన్నెల్లి.. భారీ బందోబస్తు మధ్య తరలింపు

వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు.

Updated : 27 Jun 2024 10:07 IST

నెల్లూరు: వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన్ను తీసుకెళ్లారు. జైలు బయట, ఆ మార్గంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ జైలు అధికారులు పిన్నెల్లిని లోపలికి తీసుకెళ్లారు. ఈవీఎం విధ్వంసం, పోలింగ్‌ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లికి మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని