- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
‘పీఎం కిసాన్’లో భారీ స్కాం.. !
సీబీఐ విచారణ జరిపించాలని డీఎంకే డిమాండ్
చెన్నై: రైతుల కోసం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలోనూ భారీ కుంభకోణానికి పాల్పడిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. లబ్ధిదారుల జాబితాలో ఐదు లక్షలకుపైగా అనుమానాస్పద పేర్లు నమోదైనట్లు విపక్ష నాయకులు విమర్శించారు. తమిళనాడులోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లోనే ఇలా ఎక్కువగా నమోదైనట్లు పేర్కొన్నారు. అనర్హుతల లబ్ధిదారుల వల్ల దాదాపు రూ.110 కోట్లు మోసం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రూ.32 కోట్లను రికవరీ చేశామని తమిళనాడు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
జాబితాలో అనర్హులు ఉన్నారని తేలడంతో వ్యవసాయ శాఖ సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు స్కాంకు సంబంధించి 18 మందిని అరెస్ట్ చేసినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి గగన్‌దీప్ సింగ్ బేడీ తెలిపారు. ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లను సస్పెండ్ చేశామని, 34 మంది అధికారులపై చర్యలు, 80 మంది తాత్కాలిక సిబ్బందిని డిస్మిస్ చేసినట్లు వెల్లడించారు. విల్లుపురం, కల్లాకురిచ్చి జిల్లాల్లో అవకతవకలు జరిగినట్లు చెప్పారు.
సీబీ సీఐడీ బృందాలు కడలూరు, సేలం, కల్లాకురిచి, విల్లుపురం, తిరువన్నామలై జిల్లాల్లో విచారణ చేపడుతున్నట్లు తమిళనాడు వ్యవసాయ శాఖ కార్యదర్శి గగన్‌దీప్ సింగ్ తెలిపారు. ప్రతి నకిలీ నమోదు కోసం రూ.6వేలను వసూలు చేశారని, దాని కోసం వ్యవసాయ శాఖ అధికారిక లాగిన్, పాస్‌వర్డ్‌ను వాడుకున్నట్లు తేలిందన్నారు. లాక్డౌన్ కాలంలో అంటే జూన్ నుంచి ఇలాంటి నకిలీ నమోదులు జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. పీఎం కిసాన్ కుంభకోణంపై ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ప్రతిపక్షం డీఎంకే మాత్రం దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: కర్మ సిద్ధాంతం ప్రకారం చేసింది తిరిగి అనుభవించాల్సిందే: కేటీఆర్
-
World News
Russia: అణుకేంద్రం నిస్సైనికీకరణకు రష్యా ‘నో’
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Eatala Rajender: తెరాసలో ఉంటే మంచోళ్లు.. భాజపాలో చేరితే కేసులా?: ఈటల రాజేందర్
-
General News
Telangana News: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. రాగల రెండు రోజులు భారీ వర్షాలు!
-
Movies News
Liger: అన్ని కోట్ల ఓటీటీ ఆఫర్ రిజెక్ట్ చేసిన దమ్ము ఎవరిది?.. లైగర్ టీమ్‌తో ఛార్మి ఇంటర్వ్యూ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్‌మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?